మెగా బ్రదర్స్ మధ్య మెగా ప్రిన్స్ ..వైరల్ అవుతున్న ఫోటో

Published on Dec 4, 2019 11:37 pm IST

మెగా ఫ్యామిలీ కి తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజే వేరు. తెలుగు పరిశ్రమలో ఉన్న పెద్ద కుటుంబాలలో మెగాస్టార్ కుటుంబం ఒకటి. స్వయం కృషితో చిరంజీవి సూపర్ పవర్ గా ఎదుగగా ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ స్టార్ హీరోలు ఐయ్యారు. ఒక్క మెగా ఫ్యామిలీ నుండే ఇండస్ట్రీలో అరడజను వరకు హీరోలు ఉన్నారు. కాగా ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మెగా బ్రదర్స్ ముగ్గురు..వారి పక్కనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి, పవన్ , నాగబాబు వరుణ్ పక్కపక్కనే ఉంది దిగిన ఫోటో చూడటానికి చాలా బాగుంది.

దాదాపు నెల రోజుల క్రితం నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ మెగా బ్రదర్స్ కలిసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది వరుణ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు. సంక్రాంతికి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా రీసెంట్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ హిట్ టాక్ తెచ్చుకుంది. తన తదుపరి చిత్రం వరుణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More