మెగాస్టార్ సినిమాకి మెగా ఓపెనింగ్స్ !

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సంక్రాంతికి స్పెషల్ గా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను అందుకుంది. గత 24 గంటల్లో బుక్‌మైషోలో 286 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రీమియర్ షోల నుండి లభించిన పాజిటివ్ మౌత్ టాక్ మరియు రాబోయే పండుగ సెలవుల నేపథ్యంలో, ఈ చిత్రం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తుందని భావిస్తున్నారు.

మొత్తానికి అనిల్ రావిపూడి పండుగ వినోదాత్మక చిత్రాన్ని అందించారు, ఇందులో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మొత్తమ్మీద సంక్రాంతికి మెయిన్ స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Exit mobile version