గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు – మెగాస్టార్

గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు – మెగాస్టార్

Published on Nov 3, 2019 10:07 PM IST

తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర‌జ‌తోత్స‌వ వేడుకలు ఆదివారం నాడు ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి సీనియర్‌ రచయితలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. అనంతరం మెగాస్టార్‌ మాట్లాడుతూ.. ‘‘ సినీపరిశ్రమలో దర్శకనిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించేది, సన్నిహితంగా వుండేది రచయితలతోనే. రచయితలే లేకపోతే మేము లేము అనేది వాస్తవం. ఈ సభకు నన్ను పిలవకపోయివుంటే అసంతృఫ్తిగా వుండేవాడిని. గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు. ఎంతో అనుభవం వున్న ప్రతిభ వున్నవారికి నా చేతులమీదుగా సన్మానం చేయడం జీవితంలో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం.

ఇక కోదండరామిరెడ్డిగారితో 25 సినిమాలు సుదీర్థ ప్రయాణం మాది. దర్శకుడిగాకంటే ఆత్మీయుడు, స్నేహతుడిగా కన్పిస్తాడు. కల్మషం లేని వ్యక్తి. అందరూ మేథావులే అని వారి భావాలు స్వీకరిస్తారు. సమిష్టి కృషి అని నమ్మే వ్యక్తి. రచయితలతో సాంగత్యం ఉంటుంది. అలాగే మ్యూజిక్‌ రాబట్టడంలో దిట్ట. మా కాంబినేషన్‌లో పాటలు హిట్‌ అయ్యాయి అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు