త్రివిక్రమ్ తరువాత సినిమా ఫిక్స్ అయినట్టే ?

త్రివిక్రమ్ తరువాత సినిమా ఫిక్స్ అయినట్టే ?

Published on Dec 6, 2020 6:07 PM IST

trivikram

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మెగాస్టార్ సినిమా చేస్తే చూడాలని ఎప్పటినుండో అభిమానులు ఆశపడుతున్నారు. పైగా త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ పై భారీ అంచనాలు కూడా ఉంటాయి. ఎప్పటికైనా త్రివిక్రమ్, మెగాస్టార్ సినిమా చేస్తాడని.. అది ఎప్పుడో కాదు వచ్చే ఏడాదే సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ కి త్రివిక్రమ్ ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నా.. మహేష్ రాజమౌళితో సినిమా ఫిక్స్ అయ్యాడు కాబట్టి.. త్రివిక్రమ్ తన తరువాత సినిమాని మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నాడట.

ఎలాగూ మెగాస్టార్ కూడా సినిమాల వేగం పెంచాడు. ప్రస్తుతం చిరుకు చెప్పిన లైన్ మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడట. పక్కా కమర్షియల్ గా ఈ సినిమా సాగనుందని.. అలాగే సినిమాలో దళారుల వ్యవస్థ మీద ఒక మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా వస్తోందంటే.. వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఎలాగూ హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తాజా వార్తలు