మెగాస్టార్ నుంచి అప్డేట్స్ వరద..ఇవి కూడా?

Published on Aug 21, 2021 8:00 am IST

మన టాలీవుడ్ గర్వించదగ్గ అతి తక్కువ మంది హీరోలలో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. మరి అలాంటి మెగాస్టార్ బర్త్ డే రేపు కావున మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలకు సన్నద్ధం అవుతున్నారు. మరి ఈ బర్త్ డే కి ఒక లెవెల్లో ఫీస్ట్ సినిమా వైపు నుంచి కూడా రెడీ అవుతుంది. అయితే అది ఒకటి రెండు కాదు చాలానే ఉండేలా ఉన్నాయని తెలుస్తుంది.

బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో చేసిన భారీ చిత్రం “ఆచార్య” నుంచి వేదాళం రీమేక్ అలాగే బాబీతో చేసే సినిమా వరకు కూడా సాలిడ్ అప్డేట్స్ రానున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ మోహన్ రాజాతో ప్లాన్ చేసిన చిత్రంపై మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు. దాని నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అన్నది చాలా ఆసక్తిగా మారింది.

అంతే కాకుండా మిగతా సినిమాలకు కూడా టైటిల్స్ ఫిక్స్ అయ్యాయని కూడా టాక్ ఉంది పైగా ఈ అన్ని సినిమాలు నుంచి కూడా అప్డేట్స్ రానున్నాయని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం బాస్ బర్త్ డే కి అప్డేట్స్ వరదతో మెగా ఫ్యాన్స్ కి సాలిడ్ ఫీస్ట్ ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :