50 మిలియన్ టచ్ చేసిన మెగాస్టార్ చార్ట్ బస్టర్.!

Published on Jun 6, 2021 9:39 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొనడానికి గల ప్రధాన కారణాల్లో సంగీతం అందిస్తున్న మణిశర్మ కూడా ఒకరని చెప్పాలి.

మెగాస్టార్ మరియు మణిశర్మల కాంబోలో రోమాలు నిక్కబొడిచే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మాత్రమే కాకుండా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్స్ కూడా ఉన్నాయి. మరి అలా ఈ సినిమా కోసం మళ్ళీ చాన్నాళ్ళకి పని చేస్తున్నారని తెలియడంతో అంచనాలు మరింత అయ్యాయి.

మరి అలా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ లాహే లాహే కూడా సూపర్ హిట్ అయ్యింది. అలా అయ్యి ఇప్పుడు ఈ సాంగ్ 50 మిలియన్ మార్క్ ను టచ్ చేసి మెగాస్టార్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ సాంగ్ గా నిలిచింది.

ఇక ఈ సాంగ్ తర్వాత చరణ్ మరియు పూజా హెగ్డేలపై ప్లాన్ చేసిన బ్యూటిఫుల్ నెంబర్ కోసం మెగా ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది కూడా అతి త్వరలోనే రానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :