మెగాస్టార్ కూడా తన అల్లుళ్లను ఆదుకోలేకపోయాడా ?

Published on Jul 19, 2018 4:51 pm IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్, ఇద్దరు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా అభిమానులను కూడా పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు. మొదటిదిగా కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ నటించిన ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రానికి క్రేజ్ తీసుకురావడానికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే రంగంలోకి దిగినప్పటికీ ఆ సినిమా బాక్స్ అఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయింది. గత కొన్ని సినిమాలుగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు మెగాస్టార్ పూర్తి సపోర్ట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ తేజ్ కు ఇంకో పరాజయం తప్పలేదు.

ఇక మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విజేత’ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలై, ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఈ చిత్రం విడుదల తర్వాత కూడా మెగాస్టార్ ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి ఎంత గొప్పగా చెప్పినా బాక్స్ ఆఫీసు వద్ద ఈ విజేత చిత్రం బిలౌవ్ ఏవరేజ్ ఓపెనింగ్స్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఏమైనా మెగాస్టారే ప్రమోట్ చేసినా కూడా ఈ చిత్రాలు సంతృప్తికరమైన విజయాల దిశగా వేళ్ళలేదంటే ఆలోచించదగ్గ విషయమే.

సంబంధిత సమాచారం :