లేటెస్ట్..మెగాస్టార్, సీఎం జగన్ సహా పలువురి సినీ పెద్దల నడుమ కీలక భేటీ.?

Published on Jun 23, 2021 12:04 pm IST

నిన్ననే టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. మరి అలాగే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెలుస్తుంది. మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి సహా మరికొందరు నిర్మాతలతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఓ కీలక భేటి లో పాల్గొననున్నారట. అయితే దీనికి గల ప్రధాన కారణం కూడా వినిపిస్తుంది.

ఆ మధ్యన విడుదల అయిన పవన్ చిత్రం “వకీల్ సాబ్” నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్ టికెట్ల రేట్లను భారీగా తగ్గించడం హాట్ టాపిక్ గా మరడమే కాకుండా అనేక చోట్ల థియేటర్ యాజమాన్యమే సినిమా థియేటర్ మూసే పరిస్థితి ఏర్పడింది. ఇక అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా ఏపీలో మినిమం ఆ చార్జెస్ మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది.

మరి మళ్లీ లాక్ డౌన్ పడి ఇప్పుడు మళ్లీ థియేటర్ లు తెరుచుకునే పరిస్థితి ఏర్పడడంతో ఈ టికెట్ రేట్ల విషయం పైనే చిరు సహా ఇతర సినీ పెద్దలు జగన్ తో భేటీ కావడానికి నిశ్చయించుకున్నట్టు తెలుస్తుంది.. రానున్న రోజుల్లో భారీ చిత్రాలే విడుదల కు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ రేట్లు కొనసాగితే నష్టాలు ఉండొచ్చనే భావన కూడా మొదలైంది. అందుకే ఈ మీటింగును ఏర్పాటు చేయనున్నారు.. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :