హాట్ టాపిక్ అవుతున్న మెగాస్టార్, ప్రభాస్ క్లాష్.!

Published on Jun 9, 2021 12:04 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లు నటిస్తున్న “ఆచార్య” మరియు “రాధే శ్యామ్” లు కూడా ఉన్నాయి. అయితే వారి నుంచి మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఈ చిత్రాలు ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయాయి. అయితే గత మే లో ఆచార్య ఈ వచ్చే జూలై లో రాధే శ్యామ్ విడుదల కావాల్సి ఉన్నాయి.

కానీ ఇప్పుడు పరిస్థితుల రీత్యా అది సాధ్యపడదని అర్ధం అయ్యింది. అయితే మరి ఇపుడు ఈ రెండు చిత్రాలు కూడా ఒకే రేస్ లో నిలవనున్నాయని ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వచ్చే దసరా రేస్ లో మెగాస్టార్ మరియు ప్రభాస్ ఈ రెండు చిత్రాల క్లాష్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :