సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దర్శనం ఇచ్చిన మెగాస్టార్.!

Published on Jun 19, 2021 12:00 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చాక తన సరికొత్త లుక్ తో అదరగొడుతూనే ఉన్నారు.

మరి ఆచార్య కు కూడా కాస్త డిఫరెంట్ హెయిర్ స్టయిల్ ట్రై చేసి కొత్తగా అనిపించారు. మరి వీటితో పాటుగా “వేదాళం” రీమేక్ నిమిత్తం కూడా గుండు లుక్ మేకోవర్ చేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు దాని తర్వాత షూట్ నుంచి బ్రేక్ లో ఉన్న మెగాస్టార్ నుంచి ఓ వీడియో బయటకి వచ్చింది దీనిలో నీలకంఠపురం దేవాలయాలు తెరిచివేత సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు.

మరి ఇందులో మెగాస్టార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు. దీనితో ఇది చూసి మెగా ఫ్యాన్స్ కాస్త ఎగ్జైట్ అవుతున్నారు. ఎలాగో షూట్ కి కూడా సమయం దగ్గర పడుతుంది కావున ఈ లుక్ కూడా ఆచార్య లో ఉంటుందా అన్న డౌట్స్ కూడా పడుతున్నారు. అవన్నీ ఏమో కానీ ప్రస్తుతం అయితే ఈ లుక్ మంచి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :