ఒకే ఫ్రేమ్ లో మెగా హీరోలు… కన్నుల పండుగే !

Published on Aug 23, 2021 4:49 pm IST

మెగా ఫ్యామిలీ రెండు తరాల హీరోలు అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఇక ఫ్యాన్స్ కు అది పెద్ద పండగే. మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా హీరోలు అంతా ఒక చోట చేరారు. ఈ క్రమంలో అంతా కలిసి ఒక ఫోటో దిగారు. చిరు, పవన్ లతో పాటు నాగబాబు ఎదురుగా సోఫాలో కూర్చుని ఉండగా.. వారి వెనుక చరణ్, వరుణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ నుంచొని ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మెగా స్టార్ చిరంజీవి కుటుంబం అంతా ఇలా ఒకే చోట ఉంటే కన్నుల పండుగగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా చిరంజీవి కుటంబంకు చెందిన హీరోలంతా ఇలా ఒకే ఫ్రేమ్ లో పలుసార్లు కనిపించారు. కానీ, ఈ సారి మాత్రం వారి మధ్య కెమిస్ట్రీ ఈ ఫోటోలో బాగా ఎలివేట్ అయింది.

అందుకే, ఇది చాలా అరుదైన ఫొటో అంటూ మెగా అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక చిరంజీవి ఫ్యామిలీ ప్రత్యేక సందర్బాల్లో తప్పకుండా ఇలా కలుస్తూ సందడి చేస్తుంటారు. ఈ అరుదైన ఫొటో బాగా వైరల్ అవుతోంది. మొత్తానికి మెగా అభిమానులు ఈ ఫోటో చూసి చాలా సంతోషంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :