‘జార్జ్ రెడ్డి’ సాంగ్ కోసం మెగాస్టార్ !

Published on Nov 18, 2019 10:01 pm IST

‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జ్ రెడ్డి’’. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ నవంబర్ 22న విడుదల కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమాకి చాలామంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ సపోర్ట్ కూడా ఈ సినిమాకి దొరికింది. ఈ సినిమాలోని ‘అడుగు అడుగు’ సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్న సంగతి తెలిసిందే.

‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా
బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్ తదితరులు సాంకేతికవర్గానికి విషయానికి వస్తే.. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటించటం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More