మెగాస్టార్ డెడికేషన్.. తన 158 వ సినిమా కోసం 12 గంటల హార్డ్ వర్క్!

మెగాస్టార్ డెడికేషన్.. తన 158 వ సినిమా కోసం 12 గంటల హార్డ్ వర్క్!

Published on Jul 9, 2026 3:58 PM IST

తెలుగు సినిమా దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందిలో కలిగించిన ప్రేరణ అంతా ఇంతా కాదు. తన హార్డ్ వర్క్ తనని ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా కావాలనుకుంటే తాను సున్నితంగా ఎలాంటి కష్టం తెలీకుండా కూడా సినిమాలు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది.

అయినప్పటికీ తన 70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ తన తొలి రోజుల్లో ఎలా కష్టపడ్డారో అంతే హార్డ్ వర్క్ ని ఇప్పటికీ కొనసాగిస్తూ మరింత ప్రేరణగా తాను నిలిచారు. ప్రస్తుతం తాను నటిస్తున్న అవైటెడ్ సినిమా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన 158వ సినిమాకి చిరు ఇప్పుడు రోజులో 12 గంటల పాటు సెట్స్ లోనే ఉండి పని చేయడం అనేది మరోసారి చర్చకి దారి తీసింది.

అది కూడా ఏదో సాధారణ సన్నివేశం కూడా కాదు వర్షంలో సీక్వెన్స్ అట. ఇదే కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా తన ఎంట్రీ సీక్వెన్స్ కి చిరు ఇలానే నీటిలోనే చాలా సేపు షూట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అంతకు మించి చిరు డెడికేషన్ ని కనబరచడం అనేది వైరల్ గా మారింది.

తాజా వార్తలు