“సీతా రామం”, “బింబిసార” సక్సెస్ లపై మెగాస్టార్ అద్భుత స్పందన.!

“సీతా రామం”, “బింబిసార” సక్సెస్ లపై మెగాస్టార్ అద్భుత స్పందన.!

Published on Aug 6, 2022 9:56 AM IST

గత కొంత కాలం నుంచి కూడా టాలీవుడ్ లో నెలకొన్న సంక్షోభం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో టాలీవుడ్ లో ఒక్కసారిగా అనేక మార్పులు చేసుకున్నాయి. ఇక ఈ గడ్డు కాలానికి చెక్ ఎప్పుడు పడుతుందా అని ప్రతి వారం కూడా ఎదురు చూస్తున్న వారికి నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యిన చిత్రాలు “బింబిసార” మరియు “సీతా రామం” చిత్రాలు సాలిడ్ బూస్టప్ లో భలే సక్సెస్ అందుకోవడం ఇండస్ట్రీ వర్గాలకు ఒక్కసారిగా నూతన ఉత్సాహాన్ని అందించింది.

మరి ఈ సందర్భంగా టాలీవుడ్ పెద్ద మెగాస్టార్ చిరంజీవి తన అద్భుత స్పందనను తెలియజేసారు. ప్రేక్షకులు థియేటర్స్ రావట్లేదని బాధ పడుతున్న ఇండస్ట్రీకి ఊరట, ఉత్సాహాన్ని ఇస్తూ కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ వస్తారని చేస్తున్న ప్రూవ్ చేసిన సీతా రామం, బింబిసార చిత్రాలకు చిత్ర నటీనటులు, నిర్మాతలకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని మెగాస్టార్ తన స్పందనను వ్యక్తం చేశారు. దీనితో ఈ ట్వీట్ మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు