మెగస్టార్ చిరంజీవికి ఆ దర్శకుడి స్టోరీ లైన్ నచ్చిందట..!

Published on Aug 20, 2021 3:00 am IST

మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం మోహ‌న్ రాజాతో దర్శకత్వంలో చేస్తున్న లూసిఫ‌ర్ రీమేక్ షూటింగ్‌లో బిజీ అయ్యాడు. దీని తర్వాత చిరు తన తదుపరి చిత్రాలను దర్శకులు మెహ‌ర్ ర‌మేశ్, బాబీలతో చేయనున్నాడు. ఇదిలా ఉంటే చిరంజీవి మరో కొత్త సినిమాకు కూడా రెడీ అయ్యాడని టాలీవుడ్‌లో టాక్ నడుస్తుంది.

ఇటీవల డైరెక్టర్ మారుతీ చిరంజీవికి ఓ కథ వినిపించాడట. అయితే మారుతి చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చిందని, దీంతో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసి తనను కలవాలని చిరు మారుతీకి చెప్పాడట. ప్రస్తుతం మారుతీ స్క్రిప్ట్ వర్క్‌పై ఫోకస్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్టును కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ మరియు యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కించ‌నున్నాయ‌ని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :