మెగాస్టార్ కొత్త సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాదే ఫిక్స్ ?

మెగాస్టార్ కొత్త సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాదే ఫిక్స్ ?

Published on Sep 27, 2019 3:00 AM IST

Chiranjeevi koratala siva

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కొర‌టాల త‌న సెంటిమెంట్‌ ను బ్రేక్ చేస్తున్నాడని.. కొర‌టాల మొదటి సినిమా ‘మిర్చి’ నుండి.. ఆ తరువాత కొరటాల తీసిన శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్‌, మ‌హ‌ర్షి చిత్రాలకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ను కాదని, సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేదిని మెగాస్టార్ తో చేయబోయే సినిమాకి సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడని ఇటీవలే మీడియాలో బాగా వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాదే సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు