మెగాస్టార్, మణిశర్మ ర్యాంపేజ్.. ‘స్టాలిన్’ రీరిలీజ్ హవా గట్టిగా ఉంటుందా!?

మెగాస్టార్, మణిశర్మ ర్యాంపేజ్.. ‘స్టాలిన్’ రీరిలీజ్ హవా గట్టిగా ఉంటుందా!?

Published on Apr 17, 2025 9:29 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో తాను పలు సందేశాత్మక చిత్రాలు కూడా తీసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో చేసిన సెన్సేషనల్ చిత్రం ‘స్టాలిన్’ కూడా ఒకటి. అయితే అప్పట్లో ఓ మాదిరిగా రన్ అయ్యిన ఈ చిత్రానికి మాత్రం సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది.

మెయిన్ గా మెగాస్టార్ మాస్ ప్రెజెన్స్ కి అలాగే మణిశర్మ డెడ్లీ కాంబినేషన్ లో ఈ సినిమా సంగీతానికి ఇప్పటికీ రిపీట్స్ లో పలు సీన్స్ చూస్తుంటారు అభిమానులు. ఒక్క అభిమానులే కాకుండా న్యూట్రల్స్ లో కూడా స్టాలిన్ కి అభిమానులు ఉన్నారు. మరి ఇలాంటి సినిమా ఫైనల్ గా రీరిలీజ్ కి రాబోతుండడం దాదాపు ఖరారు అయ్యింది.

అప్పటి ప్రింట్ ని మళ్ళీ రీమాస్టర్ చేస్తున్న పనులు ఆల్రెడీ మొదలు కాగా ఇపుడు దీని పట్ల ఆడియెన్స్ మంచి ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని జూన్ లో రీరిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయట. కానీ అభిమానులు మాత్రం ఆగస్ట్ లో మెగాస్టార్ బర్త్ డే కి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని భావిస్తున్నారు. మరి స్టాలిన్ ఎప్పుడు వస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు