‘సైరా’ బృందానికి అల్టిమేటం జారీ చేసిన మెగాస్టార్ !

Published on Mar 3, 2019 11:18 pm IST

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం టాకీ పార్ట్ త్వరలో పూర్తి కానుందని, ఇక నాలుగు రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం షూటింగ్ చాలా నెమ్మదిగా సాగుతోందని తెలుస్తోంది. దీంతో మెగాస్టార్ ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని అల్టిమేటం జారీ చేశారట.

కాగా ‘సీజీ మరియు విఎఫ్ ఎక్స్’ వర్క్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి అవ్వడానికి దాదాపు నాలుగు నెలలు సమయం పట్టనుంది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే.

మెగాస్టార్ సరసన నయనతార ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్‌ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More