“రిపబ్లిక్” చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన మెగస్టార్..!

Published on Sep 30, 2021 9:59 pm IST


మెగా హీరో సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరో హీరోయిన్‌లుగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1 అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్‌కి మెగస్టార్ చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెప్పుకొచ్చారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడని అన్నారు.

మీ అందరి ఆశీస్సులు ‘రిపబ్లిక్’ చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తున్నానని అన్నారు. రిపబ్లిక్ చిత్ర యూనిట్ అందరికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్టు ట్వీట్ చేశారు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిటర్ సెక్టార్‌కి ‘రిపబ్లిక్’ చిత్ర విజయం కూడా కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నానని చిరంజీవి అన్నారు .

సంబంధిత సమాచారం :