మెగా 158 లాంచ్ : పవన్ రాకపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!

మెగా 158 లాంచ్ : పవన్ రాకపై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!

Published on May 21, 2026 5:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా158’ నేడు పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మెగా 158 చిత్రానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.

అయితే, పవన్ తమ సినిమా ప్రారంభోత్సవానికి రావడంపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ ట్వీట్ చేశారు. 30 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ డెబ్యూ సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ముహూర్తానికి చిరంజీవి క్లాప్ కొడితే, ఇప్పుడు చిరంజీవి 158వ సినిమాకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చి క్లాప్ కొట్టడం ఆనందంగా ఉందని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. చీఫ్ గెస్ట్‌గా వచ్చి తమ సినిమాను ప్రారంభించి చిత్ర యూనిట్‌ను ఆనందింపజేసినందుకు పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా చిరు థ్యాంక్స్ తెలిపారు.

ఇక ఈ ఈవెంట్‌కు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు