ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయనున్న చిరంజీవి

ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయనున్న చిరంజీవి

Published on May 20, 2021 10:00 PM IST

ప్రస్తుతం కరోనా బాధితులు ఎక్కువగా ఇబ్బందిపడుతున్నది ఆక్సిజన్ కోసం. ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు. రోజూ లక్షల సఖ్యలో కేసులు వస్తుండటంతో దేశంలో ఉన్న ఆక్సిజన్ వనరులు సరిపోవట్లేదు. ఆసుపత్రుల్లో కూడ ఆక్సిజన్ ప్లాంట్స్ కొరత తీవ్రంగా ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ సప్లయ్ వృద్ధి చేయడం కోసం శాయశక్తులా పనిచేస్తున్నాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రెండు తెలుగు ర్రాష్టాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ స్థాపించి అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ బ్యాంక్స్ ఏర్పాటు కోసం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ పనులన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. అత్యవసర సమయంలో చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఇప్పటికే చిరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి ఎంతో మందికి సేవలందిస్తున్న సంగతి విధితమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు