వయసును మర్చిపోయి కష్టపడుతున్న చిరంజీవి !

20th, June 2018 - 08:54:08 AM

మెగాస్టార్ చిరంజీవి అంటేనే క్రమశిక్షణకు, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకుంటారు ఆయన అభిమానులు. చిరు కూడ కెరీర్ ఆరంభం నుండి ఇప్పటి వరకు ఆ సూత్రాలనే పాటిస్తూ దశాబ్దాలుగా మెగాస్టార్ హోదాలో కొనసాగుతున్నారు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 2017లో ‘ఖైదీ నెం 150’ తో కెమెరా ముందుకొచ్చిన ఆయన ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టిన యువ హీరోలా పనిచేస్తున్నారు.

కొన్ని నెలల క్రితమే మొదలుపెట్టిన ‘సైరా’ సినిమా కోసం ఆరు పదుల వయసును మర్చిపోయి మరీ కష్టపడుతూ నైట్ షూట్లు కూడ చేస్తున్నారు. ‘సైరా’ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులోనే కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణ స్పెయిన్ నుండి వచ్చిన యాక్షన్ కొరియోగ్రఫర్ల పర్యవేక్షణలో జరుగుతోంది. నిన్న తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ షూట్ జరిగింది. ఈ షూట్లో చిరు చాలా ఉత్సాహాంగా పాల్గొని, యాక్షన్ సన్నివేశాలను విజయవంతంగా పూర్తిచేసినట్టు సమాచారం.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2019 వేసవికి విడుదల చేయాలనే యోచనలో ఉన్నారు మెగా టీమ్. రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు.