తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేసుకున్న చిరంజీవి

Published on Jun 25, 2021 1:42 am IST

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ చేస్తున్న ‘ఆచార్య’ కాకుండా మూడు చిత్రాలు చిరంజీవి ఒప్పుకున్నారు. మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీలు ఈ సినిమాలకు దర్శకులు. ముగ్గురు దర్శకులు కూడ వేరే ఏ పనీ పెట్టుకోకుండా మెగాస్టార్ సినిమా మీదే పనిచేస్తున్నారు. మూడు ప్రాజెక్ట్స్ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముగ్గురు దర్శకులు కూడ చిరు నుండి ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులకు సైతం చిరు నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

అందరికీ సమాధానం అన్నట్టు చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ఏం చేయాలో డిసైడ్ అయిపోయారు. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేయాలని ఫైనల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి దర్శకుడు మోహన్ రాజాకు కూడ పిలుపు వెళ్లిందట. వీలైనంత త్వరగా ప్రీప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి చిత్రీకరణకు సిద్ధమవ్వాలని తెలిపారట. ఇప్పటికే నటీనటులు ఎంపిక కూడ దాదాపుగా పూర్తైంది. నయనతార, సత్యదేవ్ లాంటి నటీనటులు కీలక పాత్రలు చేయనున్నారు. ‘ఆచార్య’ షూటింగ్ ముగిసిన కొన్ని వారాల తర్వాత ఈ రీమేక్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :