“గాడ్‌ ఫాదర్‌” ను ప్రజలు ఆదరిస్తారన్న గట్ ఫీలింగ్ ఉంది – మెగాస్టార్ చిరంజీవి!

Published on Oct 4, 2022 4:17 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఈ దసరాకి విడుదలవుతున్న భారీ చిత్రాలలో ఒకటి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా విడుదలకు ముందు ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లో అందరు టెక్నీషియన్ల సమిష్టి కృషి వల్లే తాను ఈరోజు ఇలా ఉన్నానని అన్నారు. దర్శకులు, సంగీత దర్శకులు, యాక్షన్ కొరియోగ్రాఫర్‌ ల కృషి తనను పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేర్చిందని, అది తన వల్లే సాధ్యం కాదని అన్నారు. తన ఇమేజ్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ సబ్జెక్ట్‌ని తనతో తీయాలనే ఆలోచన చరణ్‌కే వచ్చిందని, మోహన్‌రాజా ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారని చిరు వెల్లడించారు.

అయితే ఒరిజినల్‌ లూసీఫర్ లో ఉన్న లూజ్ ఎండ్‌లను మోహన్ రాజా తొలగించారని చిరంజీవి పేర్కొన్నారు. గాడ్‌ఫాదర్‌ను ప్రజలు ఆదరిస్తారన్న గట్ ఫీలింగ్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చెప్పడం మర్చిపోయిన టెక్నీషియన్స్‌కి కృతజ్ఞతలు తెలిపాడు చిరు. ప్రముఖ నటుడు సంగీత దర్శకుడు థమన్, నిర్మాత ఆర్‌బి చౌదరి మరియు చిత్రానికి తమ అపారమైన మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు. ప్రతి టెక్నీషియన్ డబ్బు ఆశించకుండా సినిమాపై తమ ప్రేమను కురిపించారని చిరు పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం లో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ రావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :