కొరటాలకు తన మార్క్ విషెష్ తెలిపిన మెగాస్టార్.!

Published on Jun 15, 2021 4:00 pm IST

ఈరోజు మన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ బర్త్ డే కావడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా తనకి బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అలా ఇప్పటికే కొరటాల తో వర్క్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ శుభాకాంక్షలు తెలియజేయగా మరి వారితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కొరటాలకు తన మార్క్ విషెష్ తెలియజేసారు. కొరటాల సినీ శైలిని తన ఆలోచనా సరళిని ఉద్దేశించి చెబుతూ..

“ఆ కలానికి, సమాజంలో మార్పు తేవాలనే తపన ఉంది. ఆ దర్శకుడికి, ఆశయాన్ని దృశ్యంగా మలిచే దార్శనికత ఉంది. “ఆచార్య” సృష్టికర్త కొరటాల శివ కి జన్మదిన శుభాకాంక్షలు”. అని మెగాస్టార్ సింపుల్ గా లోతైన లైన్స్ తో వ్యక్త పరిచారు. మరి ప్రస్తుతం వీరి కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే దీనిపై భారీ అంచనాలు కూడా నెలకొనగా మెగా ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :