మెగాస్టార్ లైనప్ లో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ.!

Published on Aug 11, 2020 11:11 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సందేశాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని వచ్చిన వార్త కూడా మరిన్ని అంచనాలను పెంచింది.

అయితే చిరు ఈ భారీ ప్రాజెక్ట్ అనంతరం పలు చిత్రాలను లైనప్ లో ఉంచారు. వాటిలో తమిళ సూపర్ హిట్ చిత్రం “వేదాళం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమా విషయంలో గత కొంత కాలం నుంచీ బజ్ వినిపిస్తుంది. కానీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ మెగాస్టార్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫామ్ అయ్యిందట. ఇక ఈ చిత్రంపై అధికారిక ప్రకటన మెగాస్టార్ పుట్టినరోజు ఆగష్టు 22న అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని నిర్మాత అనీల్ సుంకర మరియు రామ్ చరణ్ లు సంయుక్తంగా నిర్మించనున్నారని టాక్.

సంబంధిత సమాచారం :

More