బిఏ రాజు ఒక సినీ ఎన్ సైక్లోపీడియా – మెగాస్టార్ చిరు

Published on May 22, 2021 11:00 am IST

ఒక్క మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా మొత్తం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కూడా ఒక ఉన్నత శిఖరం ఎన్నో ఏళ్ల నుంచి సినిమాలో ఉంటూ అపారమైన సేవలు వేల కొద్దీ సినిమాలకు అందించారు. మరి ఇదిలా ఉండగా అసలు ఎవరూ ఊహించని విధంగా బయటకు వచ్చిన ఆయన మరణ వార్త ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచి వేసింది. దీనితో మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తన నివాళులు అర్పించి వారిద్దరికీ ఎన్నటి నుంచో ఉన్న బంధాన్ని గూర్చి ఎమోషనల్ గా పొందుపరిచారు. వారి మధ్య ఉన్న బంధంపై మాట్లాడుతూ రాజు గారి ఉన్నతతను వివరిస్తూ..

“బి.ఏ.రాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని.. షూటింగ్ స్పాట్ లో వచ్చి నాతో చాలా సరదాగా ముచ్చటించేవారు. నా చాలా సినిమాలకు ఆయన పీఆర్ వోగా పని చేశారు. సినిమాల సమస్త సమాచారం.. సంవత్సరాల క్రితం రిలీజైన క్లాసిక్స్ కి సంబంధించిన కలెక్షన్స్ ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెజ్ బ్యాంక్ ఆయన.

ఏ సినిమా ఏ తేదీన రిలీజైంది? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్ లో ఎన్ని రోజులు ఆడింది.. 100 రోజులు 175 రోజులు 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు “ఎన్ సైక్లోపెడియా”లా సమాచారం అందించేంత ప్యాషన్ వున్న పత్రికా జర్నలిస్ట్.. మేధావి.. సూపర్ హిట్ సినీమ్యాగజైన్ కర్త, అనేక సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన బి.ఏ.రాజుగారు లాంటి వారు ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేగు! అన్న వార్త విని షాక్ కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని చిరు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

సంబంధిత సమాచారం :