ఏపీ సీఎం జగన్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు.!

Published on Jun 22, 2021 2:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా సహా బయట పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని వాటిని పంచుకున్నారు. మరి ఇటీవలే చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు స్టార్ట్ చేసి తెలుగు రాష్ట్రాల కరోనా బాధితుల పట్ల ఆపద్బాంధవుడు అయ్యారు.

మరి ఇదిలా ఉండగా మెగాస్టార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక మెగా వ్యాక్సిన్ డ్రైవ్ ని చేపట్టి ఒకే రోజులో 13 లక్షలకు పైగా వ్యాక్సిన్ లను వేసిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక ప్రశంసలు కూడా వచ్చాయి. మరి భారీ రికార్డు పైనే మెగాస్టార్ తన స్పందనను తెలియజేసారు.

“ఒక్క రోజులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 13 లక్షల 72వేలు మందికి వ్యాక్సిన్ వేయడం అభినందనీయం అని అలాగే వారి ఎఫర్ట్స్ అంతా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలకి మంచి ధైర్యాన్ని ఇస్తుంది అని, ఇలాంటి ఇన్స్పెరింగ్ నాయకత్వాన్ని అందిస్తున్న శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కంగ్రాట్స్ తెలుపుతున్నాని” మెగాస్టార్ తన స్పందనను తెలియజేసారు.

సంబంధిత సమాచారం :