ఇంక మెగాస్టార్ మెగా సినిమా పక్కకి వెళ్ళినట్టేనా.?

Published on Nov 24, 2020 7:03 am IST

సినీ వర్గాల్లో ఎప్పుడూ కొన్ని ప్రామాణికాలు కాస్త ఆసక్తికరంగాను ఒకింత కొత్తగానూ ఉంటాయి. వాటిలో భాగంగానే కొన్ని కాంబినేషన్స్ అంటే ఎనలేని క్రేజ్ ఏర్పడుతుంది. అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ కోసమే ఇప్పుడు మనం చెప్పుకొనేది. టాలీవుడ్ లెజెండరు హీరో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా అంటే చెయ్యకుండా ఎవరూ ఉండరు.

అలాంటిది అప్పటి వరకు చిరుతో చెయ్యని ఒక టాప్ మోస్ట్ అండ్ మోస్ట్ లవబుల్ డైరెక్టర్ అయితే ఆ కాంబోకు సెపరేట్ క్రేజ్ ఏర్పడుతుంది. మరి అలాంటి దర్శకుడితోనే చిరు సినిమా కోసం ఎప్పటి నుంచో అంతా ఎదురు చూస్తున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమే.

వీరిద్దరి కాంబో నుంచి ఓ సినిమా ఉందని ఎప్పుడో ఫిక్సయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ సినిమా అడ్రెసే ఇప్పుడు లేదు. ఎప్పుడు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. అలాగే వీరు ఇప్పుడు టేకప్ చేసిన లైనప్ ను చూసినా కూడా ఎక్కడా ఈ సినిమా ఉంటుంది అని తెలియట్లేదు. మరి వీరి కాంబో నుంచి సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More