ఫలక్నూమా ప్యాలస్ లో కపిల్ దేవ్ తో మెగాస్టార్ చిరంజీవి!

Published on Aug 29, 2021 10:06 pm IST

మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన పాత మిత్రులను కలుసుకున్నారు. ఫలక్ నూమా ప్యాలస్ లో టీమ్ ఇండియా మాజి కెప్టెన్ అయిన కపిల్ దేవ్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కలుసు కున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు చిరు. ఫలక్ నూమా ప్యాలెస్ సెట్టింగ్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది అని వ్యాఖ్యానించారు. కలిసిన సందర్భంగా పాత జ్ఞాపకాలను ఆప్యాయంగా గుర్తు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాక క్రికెట్ ప్రపంచ కప్ ను గెలిపించిన వ్యక్తి అని, హర్యానా హరికేన్ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :