మెగాస్టార్ మరో మహత్తర కార్యం నిజమే అట.!

Published on Jun 12, 2021 2:00 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో “మెగాస్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై ఎంత కఠిన శ్రామికుడో.. నిజ జీవితంలో ఎంతో మందిని ఆదుకునే ప్రజా సేవకుడు” అని కూడా అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ప్రత్యక్షం గానో పరోక్షం గానో ఎంతో మందికి సాయం అందించిన మెగాస్టార్ ఇటీవలే దారుణంగా ఉన్న కరోనా ప్యాండమిక్ టైం లో ఎంతో కీలకం అని తెలుసుకున్న ప్రాణ వాయువు కోసం ప్రజలు ఎన్ని ఇక్కట్లు పడ్డారో చూసాము.

అందుకే తానే స్వయంగా స్వంత ఖర్చులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ స్టార్ట్ చేసి మరెంతో మందికి ప్రాణదాతగా మారారు. అయితే ఇదిలా ఉండగా ఈ గ్రేట్ మూవ్ తర్వాత మెగాస్టార్ చిరు మరో మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టనున్నారని టాక్ వినిపించింది. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో తానే స్వయంగా అంబులెన్స్ సర్వీస్ లు స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారని కొన్ని రోజుల కితం టాక్ వినిపించింది.

మరి అది నిజమే అని ఇపుడు తెలుస్తుంది. ప్రస్తుతం అందిస్తున్న ఆక్సిజన్ బ్యాంక్స్ మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రజలు ముఖ్యంగా పల్లెల్లోని ప్రజలు సరైన సమయానికి అంబులెన్సులు దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని, అలాగే పలువురు పేదలను డబ్బులు గుంజేందుకు పీడిస్తున్న అంశాలు తెలుసుకున్న చిరు చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో మెగాస్టార్ శ్రీకారం చుట్టిన ఈ కార్యంపై మెగా ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :