పాప ప్రాణాలు కాపాడినందుకు మెగాస్టార్ గిఫ్ట్ !

Published on Apr 23, 2019 8:23 pm IST

హైదరాబాద్ గౌలీగూడ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నల్లాలో పడిన నాలుగు సంవత్సరాల దివ్య అనే పాపను అగ్నిమాపక సిబ్బంది చెందిన క్రాంతి కుమార్‌ ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి క్రాంతి కుమార్‌ ను అభినందిస్తూ… చిరు కానుక పంపించారు. వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలను క్రాంతి కుమార్‌ కు బహుమతిగా చిరంజీవి అల్లు అరవింద్ చేత పంపించారు.

అల్లు అరవింద్ క్రాంతి కుమార్‌ ను ప్రత్యేకంగా కలుసుకుని లక్ష బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పాప దివ్యను కూడా ఆదుకుంటామని తెలిపారు. ఇక కొన్ని రోజుల క్రితం రాఘవ లారెన్స్ తన ఛారిటబుల్ ట్రస్ట్ ను హైదరాబాద్ లో కూడా ప్రారంభిస్తున్న సందర్భంగా రెన్స్ తన ట్రస్ట్ కు మెగాస్టార్ 10 లక్షలు విరాళం అందించిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :