చిరు రెండు సార్లు “ప్రాణం” పోసుకున్న ఒకటే తేదీ.!

Published on Sep 22, 2020 1:13 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సినీ చరిత్ర కోసం కానీ ఆయన జీవిత చరిత్ర కోసం కానీ తెలియని వారు ఎవరూ ఉండరు. దాదాపు మూడు దశాబ్దాలు నెంబర్ 1 గా ఏక ఛత్రాధిపత్యం మధ్యలో మరో దశాబ్దం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమా చేసినా బాక్సాఫీస్ దగ్గర అదే ఇంపాక్ట్..అలాంటి ఎన్నో వండర్స్ చేసిన మెగాస్టార్ చిరు ఈరోజు సెప్టెంబర్ 22తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం రాయడానికి అడుగు పెట్టి 42 సంవత్సరాలు పూర్తయింది.

దీనితో చిరు తాను రెండు సార్లు ప్రాణం పోసుకున్న ఈ ముఖ్యమైన ఒకటే అని తేదీను తెలిపారు. మొదటిది గత నెల ఆగష్టు 22 తాను ప్రాణం పోసుకున్న పుట్టినరోజు అయితే మరోకటి సరిగ్గా నెల వ్యవధిలో సెప్టెంబర్ 22న తాను నటించిన మొట్ట మొదటి చిత్రం “ప్రాణం ఖరీదు” తో రెండో సారి ప్రాణం పోసుకున్న రోజని తెలిపారు. తన తొలి చిత్రం విడుదల కాబడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణం అయిన అభిమానుల అందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞ్యతలు తెలియజేస్తున్నాని చిరు తెలిపారు.

సంబంధిత సమాచారం :

More