అర్ధరాత్రి అయినా సరే మెగాస్టార్ సాయం ఆగలేదు.!

Published on Jun 8, 2021 6:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల నుంచి స్వల్ప విరామంలో ఉన్నారు. మరి అలాగే ఈ సమయంలోనే మెగాస్టార్ మరియు తన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆక్సిజన్ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులు కితం స్టార్ట్ చేసిన ఈ మహత్తర కార్యం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్విరామంగా కొనసాగుతుంది.

అయితే ఈ సహాయం ఏ సమయంలో అయినా దొరుకుతున్నట్టు ఇపుడు తెలిసింది. ఇటీవల రాజాం ప్రాంతంలో కరోనా సోకిన ఓ న్యాయవాదికి ఇది వరకే ఇచ్చిన ఆక్సిజన్ సిలిండర్ అయ్యిపోగా అర్ధ రాత్రి సమయంలో అక్కడి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు వారిని సంప్రదించగా అర్ధ సమయం అయినా కూడా స్పందించి వచ్చి అందించి కాస్త ప్రమాదకరంగా మారిన ఆ లాయర్ ను మళ్ళీ కాపాడయిన వారయ్యారు. దీనితో చిరు తలపెట్టిన ఈ మహత్తర కార్యం ఇలా ఎందరో ప్రాణాలను కాపాడినట్టు అయ్యింది..

సంబంధిత సమాచారం :