ప్రముఖ ఫైట్ మాస్టర్ ఆపరేషన్ కు చిరు ఆర్ధిక సాయం.!

Published on May 21, 2021 2:00 pm IST

ఒక హీరోగా టాలీవుడ్ లెజెండరీ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రీల్ హీరోగానే కాకుండా ఎప్పటి నుంచి రియల్ హీరోగా కూడా చిరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ టాలీవుడ్ నుంచి ముందు ఉండేవారు. మరి ఇపుడు కరోనా మూలాన నెలకొన్న పరిస్థితుల రీత్యా నిన్న ప్రతీ జిల్లాకు ఆక్సిజన్ ప్లాంట్ ను నెలకొల్పాలని మరో మహా యాగానికి పూనుకున్నారు.

అలాగే మరోపక్క అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆర్ధిక సాయాన్ని అందిస్తూ తన గొప్ప మనసు చాటుకున్నారు. అయితే తాజాగా కోలీవుడ్ కి చెందిన ప్రముఖ ఫైట్ మాస్టర్ పొన్నం బలం కు రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు. తన కిడ్నీ ఆపరేషన్ నిమిత్తం చిరు ఆ మొత్తాన్ని తనకి అందించారని అందుకు చిరు అన్నయ్యకి కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నా అని పొన్నం వీడియో ద్వారా తెలియజేసారు.

గత కొన్నాళ్ల నుంచి పొన్నం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమయంలో చిరు అందించిన సాయం ఆయనకు బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. అయితే పొన్నం ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. తన స్పెషల్ మ్యానరిజమ్స్ కూడా ప్రతీ ఒక్కరికి బాగా గుర్తే..

సంబంధిత సమాచారం :