అదిరిపోయే సీన్ తో జాయిన్ అయిన మెగాస్టార్.!

Published on Dec 3, 2020 8:33 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు. అయితే లాక్ డౌన్ రాకుండా ఉంటే ఎప్పుడో పూర్తయ్యిపోవాల్సిన ఈ చిత్రం చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

ఇక ఆ గ్యాప్ అనంతరం మళ్ళీ షూట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న సమయంలో చిరుకు కరోనా వచ్చింది అన్న వార్త మరింత టెన్షన్ ను పుట్టించింది. కానీ తర్వాత ఏమీ లేదన్న వార్త కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. సో అక్కడ నుంచి ఫైనల్ గా మెగాస్టార్ ఇప్పుడు ఆచార్య షూట్ కోసం సెట్స్ లో అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.

అలాగే ఈ షూట్ ను కూడా ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్ చేసారని సమాచారం. అలాగే ఈ వారం అంతా కూడా చిరు ఆచార్య షూట్ లో పాల్గొని అనంతరం తన సోదరుడు నాగబాబు కూతురు నిహారిక వివాహ నిమిత్తం రాజస్థాన్ పయనం కానున్నారు. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీ రోల్ లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More