“పుష్ప” టీజర్ పై తన మార్క్ రెస్పాన్స్ ఇచ్చిన మెగాస్టార్.!

Published on Apr 8, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు బన్నీ బర్త్ డే సందర్భంగా అదిరే మాస్ టీజర్ కట్ ను చెయ్యగా ఆల్ ఓవర్ భారీ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇండస్ట్రీ నుంచి ఇతర కో స్టార్స్ నుంచి ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ టీజర్ పై మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ లో రెస్పాన్స్ ఇచ్చారు. “పుష్ప టీజర్ చూసాను చాలా రియలిస్టిక్ అండ్ రస్టిక్ గా ఉందని అలాగే పుష్ప రాజ్ గా బన్నీ తగ్గేది లే” అంటూ చిరు అల్లు అర్జున్ కి తన బర్త్ డే విషెష్ చెబుతూనే పుష్ప టీజర్ పై తన స్పందనను తెలియజేసారు. మరి ఇప్పుడు మెగాస్టార్ తన “ఆచార్య” లో బజీగా ఉండగా అన్ని సరిగ్గా సెట్టయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ లను తొందరలోనే స్టార్ట్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం :