మెగస్టార్ రీమేక్‌కి ఆ టైటిల్ ఫిక్స్ అయినట్టేనా?

Published on Jul 29, 2021 3:00 am IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” సినిమా తెఔగులో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ రీమేక్‌కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో నుంచి ఈ రీమేక్‌కి బాగానే మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ ఆగస్టు 12 నుంచి మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ రీమేక్‌కి కింగ్ మేకర్ అని, గాడ్ ఫాదర్ అని, ఫిల్మ్ మేకర్ అని రకరకాల టైటిల్స్ వినిపించాయి. అయితే గాడ్ ఫాదర్ అనే టైటిల్‌కు చిత్ర బృందం మొగ్గు చూపిస్తుందని దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ పనిచేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :