మాస్ అండ్ స్టైలిష్ గా “భోళా శంకర్”లో చిరు ఫస్ట్ లుక్!

Published on Mar 1, 2022 9:12 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు మెహర్ రమేష్ తో ప్లాన్ చేసిన సాలిడ్ యాక్షన్ డ్రామా “భోళా శంకర్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఈరోజు మహా శివరాత్రి సందర్భంగా తమ భోళా శంకరుడి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నామని మొన్ననే అనౌన్స్ చేసేసారు. మరి ఇప్పుడు ఆ అవైటెడ్ ఫస్ట్ బయటకి వచ్చేసింది.

అయితే ఇది మాసివ్ అండ్ స్టైలిష్ గా ఉందని చెప్పాలి. అలాగే మోషన్ పోస్టర్ వీడియోలో అయితే చేతిలో చైన్ తిప్పుతూ సాలిడ్ జీప్ పై కూర్చొని మెగాస్టార్ అదిరే ట్రీట్ ఇచ్చే రేంజ్ లో కనిపిస్తున్నారు. అలాగే ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మరోసారి మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు కి సోదరి పాత్రలో నటిస్తుంది. అలాగే మహతి సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :