మెగాస్టార్ సినిమా లాంచ్ అయ్యేది అప్పుడేనా..?

Published on Jan 16, 2021 7:07 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తో “ఆచార్య” అనే సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇది ఇంకా లైన్ లో ఉండగానే చిరు రెండు ఆసక్తికరమైన రీమేక్ ప్రాజెక్ట్ లను టేకప్ చేశారు. వాటిలో లూసిఫర్ రీమేక్ కూడా ఒకటి.

మరి ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుందో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు గాను మేకర్స్ వచ్చే జనవరి 21న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబంధించి మిగతా డీటెయిల్స్ అప్పుడు బయటకు వస్తాయేమో చూడాలి..

సంబంధిత సమాచారం :

More