మెగాస్టార్ ‘సైరా’కు తప్పని లీకుల బాధ !

Published on Jul 29, 2018 11:31 am IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుండి ఎప్పుడు పూర్తవుతుందా ఇప్పుడు ఎక్కడ షూట్ చేస్తున్నారా అని మెగా అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ను తీసుకోవటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న సైరాకు లీకులు బాధ మాత్రం తప్పట్లేదు.

ఎటువంటి స్టిల్స్‌ లీక్‌ అవ్వకుండా చిత్రబృందం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, చిత్రానికి సంబధించి లీకులు మాత్రం ఆగటంలేదు. ఆ మధ్య లొకేషన్ స్టిల్ లీక్ అయి సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా పోరాట సన్నివేశాలకు సంబంధించి ఫొటోలు లీక్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, మెగా డాటర్ నిహారిక ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :