ఫోటో మొమెంట్ : మెగాస్టార్ చిరంజీవి తో మాస్ మహారాజా రవితేజ

Published on Jan 15, 2023 1:00 am IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా యువ దర్శకుడు బాబీ దీనిని భారీగా యాక్షన్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన తమ మూవీ ఫైనల్ గా నిన్న రిలీజ్ అనంతరం ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి ఆడియన్స్, ఫ్యాన్స్ ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తుండడం ఎంతో ఆనందంగా ఉందని అంటోంది వాల్తేరు వీరయ్య యూనిట్.

కాగా నిన్న ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు యూనిట్ సభ్యులు. అయితే సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి, రవితేజ పాత్ర సినిమాకి ఎంతో ఇంపార్టెంట్ అని, అలానే ఆ పాత్ర కేవలం తనకు మాత్రమే సరిపోతుందని, అలానే ఈ సినిమాలో తను భాగమైనందుకు రవితేజ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్, అనంతరం ఆయనతో కలిసి సరదాగా ఒక పిక్ దిగారు. వారిద్దరూ కలిసి వాల్తేరు వీరయ్య సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ దిగిన ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :