మనుషుల్లోనే దేవుడున్నాడని మెగాస్టార్ నిరూపిస్తున్నారు !

Published on Apr 7, 2020 9:00 pm IST

‘దైవం మానుషరూపేణా ‘ అన్నారు పెద్దలు. అంటే… మనుషుల్లోనే దేవుడున్నాడని అర్ధం. ఆ విషయాన్ని పదేపదే తన పెద్ద మనస్సుతో నిరూపిస్తున్నారు మెగాస్టార్‌ శ్రీ చిరంజీవి గారు. గుంటూరు జిల్లా ” చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ ” అధ్యక్షురాలు కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గారు గుండె జబ్బుతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న శ్రీ చిరంజీవి గారు మెడికల్‌ రిపోర్ట్స్‌ తెప్పించుకుని హైదరాబాద్‌ స్టార్‌ హాస్పిటల్స్‌ చైర్మన్ & ఎండి మరియు ఫేమస్ హార్ట్‌ సర్జన్ శ్రీ Dr గోపీచంద్ గారి ద్వారా జబ్బు తీవ్రతను గమనించారు.

వెంటనే హుటాహుటిగా నాగలక్ష్మి గారిని హైదరాబాద్‌కి రప్పించే ఏర్పాట్లు….. అవసరమైన ఆపరేషన్‌కి సంబంధించి అన్ని చర్యలు… దగ్గరుండి చూసుకుంటున్నారు. రేపు ఆమెకి ఆపరేషన్‌ జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. తనను అమితంగా ప్రేమిస్తున్న అభిమానులు ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్న శ్రీ చిరంజీవి గారి మంచి మనసుకి ప్రత్యేక ధన్యవాదాలు.కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే.

నాగలక్ష్మి గారు తొందరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలవ్వాని మనసారా ఆకాంక్షిస్తూ… ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ… జై చిరంజీవ… జై జై చిరంజీవ అంటూ కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

X
More