లేటెస్ట్ : మెగా సర్ప్రైజ్ కోసం సిద్ధం అవ్వమంటున్న మెగాస్టార్ చిరంజీవి

లేటెస్ట్ : మెగా సర్ప్రైజ్ కోసం సిద్ధం అవ్వమంటున్న మెగాస్టార్ చిరంజీవి

Published on Dec 14, 2022 5:21 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ షూట్ లో పాల్గొంటున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ ఆడియన్స్ ని మెగా ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై అంచనాలు మరింతగా పెంచేసాయి. ఈ మూవీ 2023 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకాభిమానుల ముందుకి రానుంది.

అయితే విషయం ఏమిటంటే, తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు సినీ, వ్యక్తిగత సంగతులని ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకునే మెగాస్టార్ చిరంజీవి, ఈరోజు సాయంత్రం 6 గంటలకు నా ఇన్స్టాగ్రమ్ ఐడి ద్వారా ఒక చిన్న సర్ప్రైజ్ రాబోతోంది అందరూ సిద్ధంగా ఉండండి అంటూ కొద్దిసేపటి క్రితం ఒక పోస్ట్ చేసారు. కాగా ఇంతకీ మెగాస్టార్ చెప్తున్న ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని పలువురు మెగా ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా అకౌంట్స్ లో పలు కామెంట్స్ తో సందడి చేస్తున్నారు. మరి అదేంటో తెలియాలి అంటే మరొక గంట సమయం వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు