మెగాస్టార్ అతిధిగా పీపుల్స్ స్టార్ ఆడియో వేడుక.

Published on May 20, 2019 6:16 pm IST

లాభాపేక్ష ఆశించకుండా సామజిక అంశాలు, బడుగు బలహీనవర్గాల సమస్యలపై సినిమాలు తీసిన సోషల్ హీరో పి నారాయణ మూర్తి. పేరు వినగానే మనకు ఎర్రసైన్యం, దండోరా, చీమల దండు, ఒరేయ్ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. అందుకే ఆయన పీపుల్స్ స్టార్ ఐయ్యారు.

ఈ మధ్య సినిమాల నిర్మాణానికి కొంత విరామం ఇచ్చిన నారాయణమూర్తి ఇప్పుడు మరలా మెగాఫోన్ పట్టుకొని రంగంలోకి దిగారు. “అంగట్లో ప్రజాస్వామ్యం” పేరుతో రాయకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సినిమా చేశారు. దీనికి సంబంధించిన ఆడియో వేడుక మంగళవారం రోజున ప్రసాద్ లాబ్స్ లో జరగబోతున్నది. ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారు.

నారాయణ మూర్తి సినిమా ఆడియో వేడుకకు మెగాస్టార్ వస్తున్నారు అనే సరికి ఆ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. వసూళ్లపరంగా కూడా ఇది కలిసొచ్చే అంశమే. రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.

సంబంధిత సమాచారం :

More