మళ్లీ తాతయ్య అయిన మెగాస్టార్ !

Published on Dec 25, 2018 3:28 pm IST

క్రిస్మస్ రోజున మెగాస్టార్ చిరంజీవి నివాసంలో క్రిస్మస్ పండుగ వాతావరణంతో పాటు.. కొత్తగా మరో పండుగ వాతావరణం కూడా నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ మళ్లీ తాతయ్య అయ్యారు.

ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

కాగా శ్రీజకి పండంటి ఆడబిడ్డ పుట్టిన విషయాన్ని ఆమె భర్త మరియు యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మెగా అభిమానులతో పంచుకుంటూ.. ఈ క్రిస్మస్ నాకు జీవితంలో మర్చిపోలేనిని తెలిపారు.

సంబంధిత సమాచారం :