వైరల్..అనధికారికంగా వచ్చేసిన “ఆచార్య” పోస్టర్ కానీ…

Published on Aug 20, 2021 10:00 am IST

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈ నెల 22న కావున ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ భారీ ఎత్తున ప్లానింగ్స్ చేస్తున్నారు. మరి మరోపక్క మెగాస్టార్ నటిస్తున్న చిత్రాల నుంచి కూడా సాలిడ్ అప్డేట్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి బాస్ బర్త్ డే స్పెషల్ గా ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని తెలిసింది.

అయితే ఇప్పుడు ఈ పోస్టర్ అనధికారికంగా బయటకి వచ్చి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ధర్మస్థలి దగ్గర ఉన్న మెగాస్టార్ పిక్ ఇది. అయితే ఇది పలు థియేటర్స్ కి వెళ్లిన పోస్టర్ అని తెలుస్తుంది. అయితే మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన ఈ పోస్టర్ లో ఎలాంటి రిలీజ్ డేట్ కూడా లేదు.

దీనితో మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. మరి రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్ ఏమన్నా వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :