మాజీ సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ స్పెషల్ విషెష్.!

Published on Apr 20, 2021 10:00 am IST

ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారి పార్టీకి చెందిన నాయకులూ మరియు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు తనదైన విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

“అమితంగా శ్రమించే మరియు గట్టి కమిట్మెంట్ ఉన్న నాయకుల్లో ఒకరైన నారా చంద్ర బాబు నాయుడుకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అలాగే ఆయురాగోగ్యాలతో మరియు సుఖసంతోషాలతో ప్రజలకు మరింత సేవ చెయ్యాలని కోరుకుంటున్నాని” చిరు తెలిపారు. మరి ప్రస్తుతం మెగా స్టార్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :