మెగాస్టార్ ‘లూసిఫర్’ కోసం మరో స్టార్ రైటర్ !

Published on Sep 22, 2020 12:37 am IST

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని.. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. రచయిత ఆకుల శివతో డైలాగ్స్ రాయిస్తున్నాడని తెలుస్తోంది.

కాగా సుజీత్ ని దర్శకుడిగా అనుకున్నప్పుడే ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వెర్షన్ రాస్తున్నారు. ఇప్పుడు సాయి మాధవ్ తో పాటు ఆకుల శివ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఇక ‘లూసిఫర్’లో మంజు వార్యర్, హీరోకి చెల్లి పాత్రలో నటించింది. అయితే మంజు వార్యర్ పాత్రలోనే సుహాసిని కనిపించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని వినాయక్ షాట్ మేకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడట. మెగాస్టార్ చిరంజీవి వినాయక్ టాలెంట్ పై నమ్మకముంచి వినాయక్ ఫామ్ లో లేకపోయినా ఈ భారీ మూవీని రీమేక్ చేసే అవకాశం ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More