‘లూసిఫర్’ టార్గెట్ చేంజ్ అవ్వబోతుంది !

Published on Apr 18, 2021 11:04 pm IST

దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రిమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆగష్టు లోపు ఈ సినిమాని పూర్తి చేయాలని మెగాస్టార్ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేలా కనిపించడం లేదు పరిస్థితులు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ తో సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో ఆచార్యకి కూడా బ్రేక్ ఇచ్చారు చిరు. కాబట్టి ‘లూసిఫర్’ షూటింగ్ డేట్స్ ప్లాన్ కూడా ఇప్పుడు మారిపోనుంది. ఇక మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేస్తున్నారట.

మరి చిరు సరసన హీరోయిన్ గా ఎవర్ని తీసుకోబోతున్నారో చూడాలి. మొత్తానికి ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఇప్పటికే ఆ పాత్రలో ఇప్పుడు హీరో సత్యదేవ్ ను కనిపించబోతున్నాడు. రచయిత లక్ష్మి భూపాల్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ ను డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :